Pages

Ramadasu Keerthanas Pahi Rama Prabho(Telugu)


రచన: రామదాసు


పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణింతురా రామప్రభో
ఇందిరాహృదయారవిందాధిరూఢ సుందరాకార సానంద రామప్రభో
ఎందునేజూడ మీసుందరానందమును కందునోకన్నులింపపొద శ్రీరామప్రభో
పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగాంభీర్యదాక్షిణ్య శ్రీరామచంద్ర
కందర్పజనకనాయందురంజలి సదానందుండు వై పూజలందు రామప్రభో
ఇంపుగా జెవులకున్విందు గా నీకథల్ కందుగా మిమ్మి సొపొందరామప్రభో
వందనము చేసిమునులందరు ఘనులై రివిందలై నట్టిగోవింద రామప్రభో
బృందార కాదిబృందార్చిత పదారవిందముల నీసందర్శితానంద రామప్రభో
తల్లివీనీవెమాతండ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో
వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరంగరంజిల్లి రామప్రభో
మల్లరంగంబునందెల్ల మల్లులజీరియల్లకంసుని జంపుమల్ల రామప్రభో
కొల్లలుగనీమాయ వెల్లివిరియగ జేయునల్లపమున క్రీడసల్పు రామప్రభో
తమ్ముడునునీవు పార్శ్వమ్ములం జేరివిల్లమ్ము లెక్కడినిల్చురామప్రభో
క్రమ్ముకొని శాత్రువులుహుమ్మనుచు వచ్చెదరు‌ఇమ్మెన బాణమ్ములిమ్ము రామప్రభో
రమ్మునాకిమ్మభయమ్ము నీపాదముల్ల్ నమ్మినానయ్య శ్రీరామచంద్ర ప్రభో
కంటిమీశంఖమ్ము కంతీమీచక్రముకంటి మీపాదముల్గంటి రామప్రభో
వింటి మీమహిమా వెన్నంటి మీతమ్ముడునీవు జంటరావయ్య నావెంట రామప్రభో
మేమునీవారమైనామైనామురక్షింపు మన్నాముజాగేలశ్రీరామచంద్ర
నామనోవీధినినీప్రేమతో నుండుమీభూమీజాసహితజయ రామప్రభో
మీమహత్వమువినన్న్ మనంబందు బ్రేమంబువేమరుబుట్టు శ్రీరామప్రభో
శ్యామలసుందరంకోమలంజానకీ కాముకంత్వంభజే రామచంద్ర ప్రభో
కామితార్ధములిచ్చు నీమహత్యమువిన్నా మోరాలించు నాస్వామి రామప్రభో
కామితప్రభుడవై ప్రేమతోరక్షించుస్వామి సాకేతపురి రామప్రభో
అన్నరావన్న నీకన్ననామిదనెవరన్నవారేరిరామన్న రామప్రభో
నిన్నెగాకనుమరియన్యులగాననన్ గన్నతండ్రివిమాయన్న రామప్రభో
వెన్నదొంగిలితిన్న చిన్న కృష్ణమ్మనిన్నెన్న గావశమెరామన్న రామప్రభో
ఎన్నెన్నోజన్మములనెత్తగాజాలని నిన్నెనమ్మితిని వర్ణింతు రామప్రభో
పన్నగాధిపశాయిభావనాగత‌ఆపన్ననామనవి వినవన్న రామప్రభో
ఏటివాక్యంబుమీసాటిదైవంబుముమ్మాటికి భువిలేదుమేటి రామప్రభో
పాడుదున్మిమ్ము గొనియాడుదున్మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో
వేడుకోగానె నీజోడుకాడను నీవుకూడిరారయ్యనాతోడ రామప్రభో
నేడునాకోర్కెలీడేరగాజేసి కాపాడరాకరినేలుజూడ రామప్రభో
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందినాడవని శత్రులున్నాడ రామప్రభో
చూడమీభక్తులనుగూడమీరిపులగో రాడుమీవల్లగోవింద రామప్రభో
పుండరీకాక్షమార్తాండ వంశోద్భవాఖండలస్తుత్యకోదండ రామప్రభో
కుండలీశయనభూమండలోద్ధరణ పాషాండజనహరణకోదండ రామప్రభో
నిండుదయతోడనాయండబాయకను నీవుండిగాపాడు కోదండ రామప్రభో
జాతకౌతూహలం సేతుకృత్వారమా పూతసీతాపతేదాత రామప్రభో
పాతకులలో మొదటిపాతుకుడ నావంటి పాతుకుని కాచూటే ఖ్యాతి రామప్రభో
భూతనాధునివిల్లుఖ్యాతిగాఖండించిసీత గైకొన్నవిఖ్యాతి రామప్రభో
పూతనాకల్మషోద్ధూతపెన్ శత్రుసంహారిసీతాసమేతరామప్రభో
జాతినీతులు లేక భూతలంబునదిరుగుఘాతకులబరిమార్చు నేత రామప్రభో
ఎప్పుడున్ గంటికిన్ రెప్పవలెగాచిననొప్పుగాగావుమాయప్ప రామప్రభో
ఏదయానీదయాయోదయాంభోనిధియాది లేదయ్యనామీద రామప్రభో
ఘోరరాక్షస గర్వహరవిశ్వంభరోదారవిస్తార గుణసాంద్ర రామప్రభో
మోదముననీవునన్నాదుకోవయ్య గోదావరీతీర భద్రాద్రి రామప్రభో
నీదుబాణంబులను నాదుశత్రుబట్టిబాధింపకున్నానదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచువాదింతునే జగన్నాథ
చాలదేమిపదాబ్జాతముల సాటిపదునాల్గులోకంబులుగూడి రామప్రభో
ఏలయీలాగుగేలజేసేదు మమ్మేలుకోవయ్య మాపాలిరామప్రభో
పాలువెన్నలుమ్రుచ్చిలించయశోదరోల గట్టినమాయజాల రామప్రభో
కొల్లలుగవ్రేపల్లెపల్లవాధురులతో నల్లిబల్లిగనురంజిల్లు రామప్రభో
వాలి నొక్కమ్మున గూలినేసిన శౌర్యశాలియోనినుదలతుజాల
సాలభంజికలనిర్మూలంబుచేయగాజాలితివి గోపాలబాల రామప్రభో
తాళవృక్షమునొక్కకోల ధరగూలంగదూలనేసిన బహుశాలి
శిలయైనయహల్య శ్రీపాదములుసోకనొలతయైమిముదలచెరా
విననయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతింగొనుచు రామప్రభో
దానధర్మంబులుదపజపంబులు నీదునామకీర్తనకుసరికావు రామప్రభో
మానావమానములు మహిని నీవైయుండగనీయెడనుండమాకేల
ఙ్ఞానయోగభ్యాసమందునుండెడివారి కానందమయుడవైనావు
అణురేణుపరిపూర్ణడౌహృదివానిగామనవి విను దేవకీతనయ రామప్రభో
మాస్యమై యాశ్రిత్ర వదాన్యమై సుజనసన్మోదమై వెలుగు మూర్ధన్య రామప్రభో
నిత్యమైసత్యమైనిర్మలంబై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో
సేద్యమైమీకధల్భావ్యమై సజ్జన శ్రావ్యమైయుండునోదివ్య రామప్రభో
గట్టిగానన్ను నీవుపట్టుగావిహితమౌపట్టుగామమ్ముచేపట్టు రామప్రభో

No comments: